LPG సిలిండర్ ధరలు ప్రతినెలా మొదటి తేదీన అప్ డేట్ అవుతాయి. లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ 1న జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత LPG సిలిండర్ల ధరలు పెరుగుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. జూన్ 4న జరగనున్న ఎన్నికల ఫలితాలు డొమెస్టిక్ LPG సిలిండర్ వినియోగదారులకు భారంగా నిలుస్తాయా లేదా ఉపశమనాన్ని ఇస్తాయా అనేది వేచి చూడాల్సిందే.