Homeహైదరాబాద్latest Newsఎస్‌ఐ అజయ్‌పై ప్రశంసల జల్లు

ఎస్‌ఐ అజయ్‌పై ప్రశంసల జల్లు

ఇదేనిజం, రాయికల్ : జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో గంజాయి రావాణా, వినియోగాన్ని అరికడుతున్న ఎస్‌ఐ అజయ్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతకుముందు రాయికల్ మండలంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతూ ఉండేది. యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది’ అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గంజాయి నిషేధంపై పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తపడుతున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు, వేణి వేణు, సాయి రాజ్, గౌడ్ సుంకిశాల సత్య ఎస్ ఐ అజేయ్‌ను ప్రశంసించారు.

Recent

- Advertisment -spot_img