Homeహైదరాబాద్latest NewsBSF లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు

BSF లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్-బి, గ్రూప్​-సి (నాన్-గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 144

విద్యార్హతలు : పోస్టులను అనుసరించి అభ్యర్థులు 10+2, డిగ్రీ, డిప్లొమాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

గరిష్ఠంగా 30 ఏళ్లు

ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
  • నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు రుసుము : ఎస్​ఐ/స్టాఫ్ నర్సు పోస్టులకు రూ.200; మిగిలిన పోస్టులకు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

జీత భత్యాలు :

  • ఎస్​ఐ/స్టాఫ్ నర్సులకు నెలకు రూ.35,400 – రూ.1,12,400;
  • ఏఎస్​ఐలకు నెలకు రూ.29,200 – రూ.92,300 వరకు జీతం ఉంటుంది.
  • పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మే 19
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 17

Recent

- Advertisment -spot_img