Homeహైదరాబాద్latest NewsSiddaramaiah : అది ప్రెజర్​ కుక్కర్​ Bomb

Siddaramaiah : అది ప్రెజర్​ కుక్కర్​ Bomb

– రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై కర్ణాటక సిద్దరామయ్య స్పందన

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​లో జరిగిన పేలుడు ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ పేలుడును ఆయన ప్రెజర్​ కుక్కర్​ బాంబుగా పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లనున్నట్లు చెప్పారు. ఈరోజు పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Recent

- Advertisment -spot_img