Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి 'సిద్దార్థ రాయ్'..!

ఓటీటీలోకి ‘సిద్దార్థ రాయ్’..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “సిద్దార్థ రాయ్”. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చిన ‘సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా మే 3 న ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్ గా నటించారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ మరియు విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌ల పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ సినిమాని నిర్మించారు.

Recent

- Advertisment -spot_img