Simple One S Electric Scooter : సింపుల్ వన్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. ఈ స్కూటర్ సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే మెరుగైనది మరియు ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది. ముందుగా, సింపుల్ వన్ ఎస్ 3.7kWh ఫిక్స్‌డ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ లేదా IDC ప్రకారం 181 కి.మీ. పరిధిని అందిస్తుంది. స్కూటర్‌కు శక్తినిచ్చేది 8.5kW, PMSM మోటార్, ఇది స్కూటర్‌ను 2.5 సెకన్లలో సున్నా నుండి 40 కి.మీ.గం.కు వేగాన్ని అందుకోగలదు మరియు 105 కి.మీ./గం.కు గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నావిగేషన్‌తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పార్క్ అసిస్ట్ మరియు మరిన్ని ఉన్నాయి. అంతేకాకుండా, ఇది స్టోరేజ్ కెపాసిటీని అందించారు. సీటు హైట్ 770 మిమీగా ఉంది.ఈ స్కూటర్ డిజైన్ చాలావరకు సింపుల్ వన్‌ను పోలి ఉంటుంది, అదే, పదునైన డిజైన్ మరియు స్టాన్స్‌తో ఉంటుంది. ఇది నాలుగు రంగులలో లభిస్తుంది.. బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ మరియు నమ్మా రెడ్. సింపుల్ వన్ ఎస్ దేశంలోని 15 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.