Homeరాజకీయాలురేపే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

రేపే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

– ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
– ఉదయం 11 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
– సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు
– అర్ధరాత్రి ఫలితాలు వెలువడే చాన్స్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్‌ పద్ధతినే ఎన్నికలు నిర్వహించనున్నారు. రామగుండం ఏరియాలో మూడు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల అధికారులుగా డివిజన్‌ ఒక ఆర్డీవోను కలెక్టర్ నియమించారు. రామగుండం ఏరియాలోని ఆర్​జీ-1, ఆర్​జీ-2, ఆర్​జీ-3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్​జీ–1లో 11 పోలింగ్‌ కేంద్రాలు, ఆర్​జీ-2లో ఆరు, ఆర్​జీ-3లో ఆరు మొత్తం 23 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రామగుండం ఏరియాలోని ఆర్​జీ-1లో 5,404, ఆర్​జీ-2లో 3,557,ఆర్​జీ-3లో 3,884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని 13 కార్మిక సంఘాలు పరీక్షించుకోనున్నారు. కాగా.. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ రోజున ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు చూపించనిదే లోనికి అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. కావున వచ్చేవారు తప్పకుండా గుర్తింపుకార్డు తప్పని సరిగా తెలిపారు. తెలంగాణలో కొత్త ఆరు జిల్లాలు 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. కాగా.. మొత్తం 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img