Homeజిల్లా వార్తలుఆరు గ్యారెంటీలను అర్హలందరూ అప్లై చేసుకోండి

ఆరు గ్యారెంటీలను అర్హలందరూ అప్లై చేసుకోండి

ఇదేనిజం, జగదేవపూర్: ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఏడీఏ శివప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి కుటుంబం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దరఖాస్తుల స్వీకరణ జనవరి 6 వరకు కొనసాగుతుందన్నారు. అలాగే జగదేవపూర్, లింగారెడ్డి పల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, సర్పంచులు లావణ్య మల్లేశం, లక్ష్మీ రమేష్, లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఆనంద్, లక్ష్మి, వసంతరావు, కార్యదర్శులు, సీసీలు, అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img