Homeహైదరాబాద్latest NewsSkipping uses : రోజూ స్కిప్పింగ్ చేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Skipping uses : రోజూ స్కిప్పింగ్ చేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే

వ్యాయామం శరీరానికే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియల్ని సక్రమంగా జరిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. రక్తప్రసరణలో ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయి. ఫిట్‌గా ఉండటమే కాకుండా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. వేగంగా ఆలోచించే శక్తి వస్తుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. దీనికి సంబంధించి అనేక వర్క్ అవుట్స్ ఉన్నాయి. అందులో స్కిప్పింగ్ కూడా ప్రధానమైనదే. ఆడ , మగా అనే తేడా లేకుండా ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మంచి ఫలితాలనిస్తుంది.

వెయిట్ లాస్ అవుతారు:
ప్రతి రోజూ ఓ పావు గంట సేపు అయినా స్కిప్పింగ్ చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఓ అరగంట పాటు ఆడితే… 750 క్యాలరీలు వరకూ ఖర్చు అవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు, బయటకు వెళ్లేందుకు సమయం లేని వారు ఈజీగా స్కిప్పింగ్ చేసి బరువు తగ్గొచ్చు. దీంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి.

బ్రెయిన్ యాక్టీవ్:
స్కిప్పింగ్ ఆడటం వల్ల మీకు తెలియకుండా సంతోషంగా ఫీల్ అవుతారు. దీంతో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. బ్రెయిన్ పని తీరు కూడా మెరుగు పడుతుంది. కాబట్టి ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల బ్రెయిన్‌కి కూడా చాలా మంచిది.

Recent

- Advertisment -spot_img