తెలంగాణలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే కొత్త రేషన్ కార్డులు చిప్‌తో కూడి ఉంటాయని, కార్డుపై కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు ఉండవని సమాచారం. వీటిని రేషన్ షాపులో స్కాన్ చేసినప్పుడు వివరాలు కనిపిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.