Homeఅంతర్జాతీయం5 మీటర్ల భౌతికదూరం కూడా చాలదు...

5 మీటర్ల భౌతికదూరం కూడా చాలదు…

తుంపరల ద్వారానే కాకుండా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి జరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ఫ్లోరిడా విశ్వవిద్యాలయం మరో షాకింగ్​ విషయాన్ని తన అధ్యయనం ద్వారా ప్రపంచానికి తెలిపింది. ప్రస్తుతం మనం పాటిస్తున్న కేవలం 2 మీటర్ల భౌతికదూరం సరిపోదని, కనీసం 5 మీటర్ల వరకు దూరం పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. వాతావరణంలో కరోనా వైరస్​ 2 మీటర్ల నుంచి 4.8 మీటర్ల వరకు సంక్రమిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇక కార్యాలయాల్లో ఆరు అడుగుల దూరం కూడా ప్రమాదకరంగానే ఉందట. అంతకు మించిన దూరం ద్వారా మాత్రమే కాస్త రక్షణ ఉంటుందని నిపుణులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img