HomeసినిమాBigBoss 4 Telugu : సోహైల్​ వీరావేశానికి కారణం ఏంటి ..?

BigBoss 4 Telugu : సోహైల్​ వీరావేశానికి కారణం ఏంటి ..?

Sohail is in a trance at Big Boss House. Ariana also got into a fight with Sujata. Prior to this task he also got into a confrontation with Abhijit.

బిగ్‌బాస్ హౌస్‌లో సోహైల్ వీరావేశానికి లోన‌వుతున్నాడు. అరియానా, సుజాత‌తో కూడా గొడ‌వ ప‌డ్డాడు. ఈ టాస్కుకు ముందు అభిజిత్‌తోనూ ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు.

మోనాల్​ కోసం అఖిల్​ అభిపై మోనాల్​తో పాటు ఇతరులకు కూడా అభిపై చెడు ఉద్దేశం వచ్చేలా ప్లాన్​ చేస్తూ గేమ్​ మొదలు పెట్టాడు.

అలాగే అభిపై అఖిల్​ చేస్తున్న కుట్రలో సోహైల్​ తనకు తెలియకుండా తానే పడిపోయాడు. ఇంత‌మందితో గొడవ పెట్టుకుంది చాల‌ద‌న్న‌ట్లు నేడు అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో గొడ‌వ‌కు దిగాడు.

ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది.

https://youtu.be/AtBuKDtphX4

“ఒక్క‌రినే టార్గెట్ చేసి ఆడితే క‌థ వేరే ఉంట‌ది” అని సోహైల్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై ఫైర్ అయ్యాడు.  దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో ఏంటి కొడ‌తావా? అని మాస్ట‌ర్ మండిప‌డ్డాడు.

అయితే దివికి స‌పోర్ట్ ‌చేసే క్ర‌మంలోనే వీరి మ‌ధ్య అగ్గి రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా క‌థ వేరే ఉంట‌ది అన్న ఒక్క ప‌ద‌మే మాస్టర్‌కు మ‌హా కోపం తెప్పించిన‌ట్లు తెలుస్తోంది.

కానీ సోహైల్ గ‌త ఫిజిక‌ల్ టాస్కులోనూ ఇదే డైలాగ్ వాడి రెచ్చిపోయాడు. దీన్ని నాగార్జున సైతం వేలెత్తి చూప‌కుండా తేలిక‌గా తీసుకుంటూ న‌వ్వేశాడు.

దీంతో సోహైల్‌కు అది ఊత‌ప‌ద‌మ‌ని ఆయ‌న అభిమానులు వెన‌కేసుకొస్తున్నారు. మాస్ట‌ర్ త‌న గేమ్ తను ఆడ‌కుండా దివిది ఎందుకు ఆడుతున్నాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రికొంద‌రేమో ఇలాంటి ప్రోమోలు నెవ‌ర్ బిఫోర్‌.. షో చూశాక వ‌చ్చే డిస‌ప్పాయింట్‌మెంట్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img