HomeSocial Mediaహైదరాబాద్ లో పతంగి దారం చుట్టుకుని సైనికుడు మృతి

హైదరాబాద్ లో పతంగి దారం చుట్టుకుని సైనికుడు మృతి

హైదరాబాద్ లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. నగరంలోని లంగర్ హౌస్ లో మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. వైజాగ్ కు చెందిన కోటేశ్వర్ రెడ్డి సైన్యంలో పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పతంగుల మాంజా దారం మెడకు చుట్టుకుని తీవ్రంగా గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img