Homeలైఫ్‌స్టైల్‌#Legs #Cracked_Heels : కాళ్ళు పగులుతున్నాయా.. ఇదిగో చిట్కాలు..

#Legs #Cracked_Heels : కాళ్ళు పగులుతున్నాయా.. ఇదిగో చిట్కాలు..

సాధారణంగా చాలా మంది పాదాలు పగిలిపోతూ ఉంటాయి.

ముఖ్యంగా చలికాలం, వర్షాకాలం వస్తే చాలు పాదాలు పొడిబారిపోవడం, పగిలిపోవడం ఇలా వివిధ సమస్యలకు దారి తీస్తాయి.

నిజంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తమ పాదాల పైన శ్రద్ధ పెట్టాలి లేదు అంటే పాదాల సమస్యలు వస్తాయి.

అయితే ఈ రోజు స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ మనకి కొన్ని టిప్స్ ని చెప్పారు.

వీటిని కనుక అనుసరిస్తే పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

అలానే పాదాలకి ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే చూసేద్దాం.

పాదాలని అందంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి:

చిన్నపాటి సమస్యలు వచ్చినా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో పాదాల పట్ల శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం మంచిది లేదు అంటే పాదాలు పగిలి పోవడం, కమిలి పోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఎటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పాదాలు అందంగా ఇబ్బంది లేకుండా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోతే.. పాదాలని జాగ్రత్తగా చూసుకునే టిప్స్ ఇవే..!

పాదాలను పొడిగా ఉంచండి :

మనం ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము. బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం ఇలా చాలా పనులు ఉంటాయి.

ఇటువంటి పనులు చేసేటప్పుడు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిసి ఉండడం వల్ల సమస్యలు వస్తాయి.

అలానే వర్షంలో కాళ్ళు తడవడం వలన కూడా ఇబ్బంది వస్తుంది.

కాబట్టి ఇటువంటి కారణాల వల్ల కాళ్ళు తడవకుండా చూసుకోవాలి.

పాదాలు తడిగా ఉండడం వల్ల స్వెల్లింగ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా తడి షూస్ ఉంచుకోవద్దు.

ఇలా మీ పాదాల పై కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది.

వట్టి కాళ్లతో ఉండొద్దు:

చాలా మంది చల్లగా ఉండే దాని పైన నడుస్తూ ఉంటారు. గడ్డి, గార్డెన్ ఇలా చాలా చోట్ల నడుస్తుంటారు.

దీని వల్ల పాదాలు తడిగా అయిపోతాయి. అదే విధంగా దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి కూడా దారి తీస్తాయి.

కాబట్టి మీరు చెప్పుల్ని కానీ షూని తప్పకుండా ధరించండి.

యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకోవడం, పాదాలని పొడిగా ఉంచుకోవడం లాంటివి పాటించాలి

అలానే మీరు పాదాలను కడిగిన వెంటనే తుడిచి ఆ తర్వాత షూస్ లేదా చెప్పులు వంటివి ధరించాలి.

పాదాలని నానబెట్టడం:

బయటికి వెళ్లి వచ్చిన వెంటనే పాదాలను శుభ్రంగా కడుక్కోవడం, యాంటీ సెప్టిక్‌తో క్లీన్ చేసుకోవడం లాంటివి చేయాలి.

ఇంట్లోనే మీరు సులువైన చిట్కాలను కూడా పాటించవచ్చు.

గోరు వెచ్చని నీళ్లలో ఉప్పు మరియు షాంపు వేసి కాసేపు మీ పాదాలని వాటిలో నానబెట్టి ఆ తర్వాత తుడుచుకోవడం మంచిది.

వారానికి ఒకసారి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి.

మాయిశ్చరైజర్ అప్లై చేయడం:

నిజంగా ప్రతి రోజు పాదాలని మాయిశ్చరైజ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా కూడా ఉంటాయి

. రోజుకి రెండు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఉదయం మీ పనులు అయిపోయిన తర్వాత ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

అదే విధంగా రాత్రి నిద్రపోయేటప్పుడు మరొక సారి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల పగుళ్లు వంటివి రాకుండా ఉంటాయి.

మీరు మాయిశ్చరైజర్ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా శుభ్రమైన పాదాలకి మరియు తడిలేని పాదాలకి మాత్రమే రాయండి.

ఇలా చేస్తే మీకు పగుళ్ళు రావు మరియు పాదాలు చాలా మృదువుగా ఉంటాయి.

వర్షాకాలంలో ఉపయోగించే చెప్పులు:

వర్షాకాలంలో ఇష్టం వచ్చినట్లు బయటికి వెళ్ళిపోవద్దు. చెప్పులు షూస్ వంటి వాటిని ధరించండి ఇలా చేయడం వల్ల కూడా మీరు మంచి బెనిఫిట్ పొందుతారు తడిసి పోయే వాటిని ఎప్పుడూ వాడకండి.

దీని వల్ల పాదాలకు కూడా తడి అంటుకుపోతుంది. మంచి మెటీరియల్‌తో కూడి ఉన్న వాటిని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి.

కాబట్టి వర్షాకాలంలో తప్పకుండా మీ పాదాలకి ఈ విధంగా శ్రద్ధ తీసుకోండి తద్వారా సమస్యలు రాకుండా ఉండొచ్చు.

వర్షాకాలంలో ఈ విధంగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా పాదాలను అందంగా మృదువుగా ఉంచుకోవచ్చు.

లేదు అంటే పొడిబారిపోవడం మొదలు పగుళ్లు రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి వాస్తు ఉంటాయి.

కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని పాదాలని అందంగా ఉంచుకోండి.

ఈ సులభమైన చిట్కాలను పాటించి పాదాల పగుళ్ల నుండి దూరంగా ఉండండి.

Recent

- Advertisment -spot_img