Sound Pollution in public transport : పక్కవారికి వినపడేలా పాట మోగిస్తే.. బస్సు దించుడే.. హైకోర్టు తీర్పు
Sound Pollution – బస్సులో వెలుతుంటే ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడో లేదా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్నప్పుడో బస్సుతో ఎవరో బిగ్గరగా పాటలు పెడితే ఎలా ఉంటుంది..
చాలా మంది బస్సుల్లో ఇతరుల పాటల వల్ల ఇబ్బందులు పడిన వారు ఉండే ఉంటారు.
ఇకపై అలాంటి ఇబ్బందులు మీకు రాకపోవచ్చు..
బస్సుల్లో మొబైళ్లలో బిగ్గరగా పాటలు పెట్టడం లేదా వీడియోలు ప్లే చేయడంపై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది.
సెల్‌ఫోన్ల మోత వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై కోర్టు శుక్రవారం విచారించింది.
ఎవరైనా బస్సు లో సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాటలు, వీడియోలు చూస్తుంటే సిబ్బంది చెప్పాలని, వినకపోతే బస్సులో నుంచి దించేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.