Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయంలో ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్వర్యంలో అభిషేకం, అర్చన చేయించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కు రవి మాట్లాడుతూ..ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ వార్ల ఆశీర్వాదం తో శాససభ్యులుగా ఎన్నికైన ఆడ్లూరి లక్ష్మణ్.. భవిష్యత్ లో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేముల రాజేష్, వోజ్జల లక్ష్మణ్, గుడ్ల రవి, రమణ, శ్రావణ్ ఉత్సవ కమిటీ సభ్యులు స్తంబంకాడి గణేష్, మాదాసు మల్లేష్, నేదునూరి శ్రీధర్, కోమిరెల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img