Homeహైదరాబాద్latest Newsసంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

ఇదే నిజం ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భముగ అనుబంధ దేవాలయము అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గల గణపతికి గణపతి ఉపనిషత్లతో అభిషేకం, విశేషపూజలు హారతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి.
అలాగే వేసవి కాలం చేత అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దేవాలయంలలో గల స్వామివార్లను దర్శించుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ ,జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వేదపండితులు ముత్యాల శర్మ , స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , కాసర్ల వంశీకృష్ణ,అభిషేకం పురోహితులు బొజ్జ సంపత్ కుమార్ , అర్చకులు విశ్వనాథ శర్మ ,సాయికుమార్ , భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img