Homeహైదరాబాద్latest Newsఅడుగడుగునా స్పీడ్ బ్రేకర్లే.. పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లే.. పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

మధిర పట్టణం నడిబొడ్డులో ఉన్న రైల్వే ట్రాక్ పట్టణాన్ని రెండుగా విడదీస్తున్న క్రమంలో దీనిపై అనుసంధానంగా వాహనాల రాకపోకలను కొనసాగించేందుకు ఏర్పాటుచేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత కొంతకాలం వరకు ప్రజలకు సేవనందించింది. గడిచిన పదేళ్ల కాలంగా ఈ బ్రిడ్జిపై ఉన్న స్లాబుల జాయింట్ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన రబ్బరు జాయింట్ సీళ్ళు కొన్ని ప్రాంతాల్లో పనికిరాకుండా పోగా మరికొన్ని ప్రాంతాల్లో లేకుండా ఉండడంతో పిల్లలకు పిల్లలకు మధ్య వేసిన స్లాబుల మధ్య గాడీలు కాలువ లాగా ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ సమస్యపై పదేళ్ల కాలంగా మధిర లో ఉన్న ఆర్ అండ్ బి అధికారులు నిత్యం చూస్తున్నప్పటికీ వారి వాహనాలు ఇదే రహదారిపై రాకపోకలు సాగుస్తున్నప్పటికీ వీటి మరమ్మత్తులకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం ఆ శాఖ యంత్రాంగం విధి నిర్వహణలో వ్యవహరిస్తున్న నిబద్ధతకు నిదర్శనంగా మారింది. నిత్యం వందలాదిగా ప్రయాణం సాగించే భారీ వాహనాలతో పాటు కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర ప్రయాణ సంబంధ వాహనాలు ఈ రహదారిపై బ్రిడ్జి మీదుగా వెళుతున్న క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతుండడం గమనార్హం.

గుంటలు ఏర్పడిన ప్రాంతాలలో వాహనాలను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాల ను ఢీ కొట్టి మృత్యువాత పడిన వారితోపాటు క్రేత్తగాత్రులైన వారి సంఖ్య పదేళ్ల కాలంలో వందల్లో ఉందంటే అతిశయోక్తి కాదేమో. నిన్న రాత్రి మధిర ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న ఎర్రుపాలెం మండలం బనగాళ్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి కూడా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో సదరు డ్రైవరు తన ద్విచక్ర వాహనాన్ని ముందుకు తోలుతున్న క్రమంలో గుంటగా ఏర్పడిన ప్రాంతం నుండి తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా మధిర పట్టణo మున్సిపాలిటీలోని ప్రజలకు ఎన్నికల హామీగా మారిన ఈ రహదారి మరమ్మత్తులు ఆరోబిపై ఏర్పడిన స్పీడ్ బ్రేకర్ల మరమ్మత్తులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్పై స్థానికంగా ఉన్న అధికారులు సమస్యపై దృష్టిసారించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదనతో కూడిన విమర్శలు చేస్తున్నారు. గడచిన పదేళ్ల కాలంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు నిత్యం పట్టణ ప్రజలతో పాటు మధిర ప్రాంతం మీదుగా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై కనీసం దృష్టి సారించకపోవడం వారి విజ్ఞతకు పాలనదక్షతకు నిదర్శనం అంటూ విమర్శలను ఎక్కు పెట్టడం గమనార్హం.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మధిర మున్సిపాలిటీ లో డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారగా, అంతర్గత రహదారులు పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికార యంత్రం యంత్రాంగం స్పందించి ఆరోబిపై నెలకొన్న సమస్యను పరిష్కరించే దిశగా తక్షణ మరమ్మత్తులు నిర్వహించాలని, ప్రధాన రహదారిపై వాహనదారులను అలర్ట్ చేసే దిశగా ఏర్పాటు చేయాల్సిన హెచ్చరికల బోర్డులను ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. అద్దె బస్సు డ్రైవర్ రాజశేఖర్ మృతి ఆ మధ్యతరగతి కుటుంబానికి తీరని లోటు విషాదాన్ని మిగిల్చిన దురదృష్టకర పరిస్థితి మరికొందరి కుటుంబాలకు రాకుండా నిలువురించే దిశగా తక్షణ మరమ్మత్తు చర్యలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ చూపాలని మధిర పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img