Homeహైదరాబాద్latest News'స్పిరిట్‌' మూవీ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ సరసన సీతారామం బ్యూటీ..!

‘స్పిరిట్‌’ మూవీ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ సరసన సీతారామం బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మరి ఈ స్పూర్తితో ప్రభాస్ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మృణా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.

Recent

- Advertisment -spot_img