Homeహైదరాబాద్latest Newsయువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి: ఎస్ఐ శేఖర్ రెడ్డి

యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి: ఎస్ఐ శేఖర్ రెడ్డి

ఇదే నిజం: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ యువత ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు గత 15 రోజులుగా క్రికెట్ పోటీలు కొనసాగాయి ఆదివారం ఫైనల్ మ్యాచ్ కి బ్రదర్స్ జట్టు గన్నెవారిపల్లె జట్టు పోటీల్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ కి ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పాల్గొని క్రీడల్లో విజేతలైన జట్టులకు ప్రధమ స్థానంలో బ్రదర్స్ జట్టు గెలుపొందగా ద్వితీయ స్థానంలో గన్నే వారి పల్లి జట్టు నిలిచారు గెలుపొందిన విన్నర్ జట్టుకు 13వేల నగదు తో పాటు రన్నర్ జట్టుకు 7 నగదు తో పాటు ట్రోపీ తో పాటు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన వారికి మ్యాన్ అఫ్ ది సీరీస్మ్యా,న్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులను అందజేశారు విజేత గెలుపొందిన బ్రదర్స్ టీం గ్రామానికి చెందిన నిరుపేద యువతికి పై చదువులకు 5000 రూపాయల నగదును ఎస్సై చేతుల మీదుగా అందజేశారు ఇదే స్ఫూర్తితో నామాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి తన వంతు సహాయంగా 2000 నగదును ఆ యువతీకి అందించారు క్రీడా పోటీలు నిర్వహించిన పోతుగల్ యువతను. ఆర్థిక సాయం అందించిన బ్రదర్స్ క్లబ్ టీమ్ ను,సహకరించిన యువతను ఎస్సై శేఖర్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత జీవితం పట్ల సరైన దృక్పథ సంకల్పబలం ఉంటేనే లక్ష్యసాధనలో సఫలీకృతులు అవుతారని పేర్కొన్నారు యువత కీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని యువకులకు సూచించారు ఈ కార్యక్రమంలో క్రీడ నిర్వాహకులు కిట్టు సాయి రాకేష్ అభి సుజిత్ ముఖ్య అతిథులుగా కోలా కృష్ణ గజ్జల రాజు గాడిచెర్ల శ్రీనివాస్. ఉచిడి బాల్ రెడ్డి భాను,నాని,తిరుపతి మహేష్ వివిధ గ్రామాల క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img