Homeహైదరాబాద్latest NewsSRH VS RR: నేడు హై ఓల్టేజ్ మ్యాచ్.. భారీ స్కోర్ నమోదు అయ్యేనా?

SRH VS RR: నేడు హై ఓల్టేజ్ మ్యాచ్.. భారీ స్కోర్ నమోదు అయ్యేనా?

ఐపీఎల్ సీజన్ 17లో ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సన్ రైజర్స్ ఐదో ప్లేస్ లో ఉంది. అయితే రాజస్థాన్ తన ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అనధికారికంగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. అందులో మూడింటిలో సన్‌రైజర్స్ విజయం సాధించింది. రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సెల్‌ఫోన్‌లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించబోమని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ సంబందించిన ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.

Recent

- Advertisment -spot_img