Homeహైదరాబాద్latest Newsశ్రీశైలం ఎండబెట్టింది కేసీఆరే : Komatireddy

శ్రీశైలం ఎండబెట్టింది కేసీఆరే : Komatireddy

  • మోసాలు, పాపాలతో రాష్ట్రాన్ని కరువులోకి నెట్టిండు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇదేనిజం, నల్లగొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజూర్‌నగర్ మండలం మట్టపల్లి గ్రామంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ‘దీపా దాస్ మున్షీ’ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోయిందని మండిపడ్డారు. ఆయన తెలంగాణలోని రిజర్వాయర్‌లలో నీళ్లు లేకుండా చేశారన్నారు. కేసీఆర్ చేసిన మోసాలకి, పాపాలకి రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, రఘువీర్ రెడ్డిని 80వేల మెజారిటీకి తీసుకురాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, తెలంగాణ టూరిజం చైర్మన్‌ పటేల్ రమేశ్‌రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img