Homeహైదరాబాద్latest Newsఅనాథలైన అక్కాచెల్లెల్లను ఆదుకున్న SRS​ YOUTH

అనాథలైన అక్కాచెల్లెల్లను ఆదుకున్న SRS​ YOUTH

ఇదేనిజం, చింతలమానేపల్లి: అనాథలైన అక్కా చెల్లెళ్లను ఎస్ఆర్ఎస్ యూత్ సభ్యులు ఆదుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం బోధంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ల లక్ష్మి, రామిళ్ల శ్యామల తల్లిదండ్రులు గత పదేండ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామిల్ల లక్ష్మికి మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా లక్ష్మి భర్త మద్యానికి బానిసై హింసిస్తుండటంతో ఆమె పుట్టిన ఊరైన బోధంపల్లి గ్రామానికి చేరుకున్నది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. ఇక ఆమె చెల్లి రామిళ్ల శ్యామలకు మూడేండ్ల క్రితం పక్షవాతం వచ్చి.. కాళ్లు చేతులు పడిపోయాయి. మానసిక సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఈ ఇద్దరిని శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తన యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదుకున్నారు. ఇద్దరు అనాథలైన అక్కాచెల్లెల్లకు నిత్యావసర సరుకులు, దుప్పట్లతో పాటు రూ. 3500 నగదు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన యూత్ సభ్యులను ఎస్సై మధుకర్, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రధాన కార్యదర్శి తూమోజు వెంకటేశ్​, యూత్ సభ్యులు బోర్లె పురుషోత్తం, గుర్లె విలాస్, గ్రామస్తులు పుండలిక్, దుర్గం విజయ్, గుర్లే శ్రీనివాస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img