Homeసినిమాస్టార్‌డమ్‌ ప్రేక్షకులు అందించే వరం

స్టార్‌డమ్‌ ప్రేక్షకులు అందించే వరం

సినీరంగంలో తొలి అడుగు నుంచి కెరీర్‌ను ప్రణాళికబద్దంగా తీర్చిదిద్దుకున్నానని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా.

మన ఆశయాల్లో నిజాయితీ, స్వచ్ఛత ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసింది.

పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దక్షిణాదిన కమర్షియల్‌ కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృషించుకుంది తమన్నా.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది.

అగ్ర కథానాయికలు డిజిటల్‌ మీడియాపై అడుగుపెట్టేందుకు సంకోచిస్తున్న తరుణంలో తాను ధైర్యంగా వెబ్‌సిరీస్‌లు చేశానని చెప్పింది.

ఆమె మాట్లాడుతూ ‘డిజిటల్‌ వేదికలు నటిగా ప్రతిభాసామర్థ్యాల్ని ఆవిష్కరించుకోవడానికి గొప్ప మాధ్యమాలుగా భావిస్తా.

ఇక్కడ కొత్త కథల్ని, ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకునే అవకాశముంటుంది.

భవిష్యత్తులో మరిన్ని వినూత్న కాన్సెప్ట్‌లను ఎంచుకొని వెబ్‌సిరీస్‌లు చేస్తాను’ అని చెప్పింది.

ఓటీటీల్లో నటించడం వల్ల కథానాయికగా స్టార్‌డమ్‌ దెబ్బతింటుంది కదా అనే ప్రశ్నకు…‘ నటించడం వరకే మన చేతిలో ఉంటుంది.

స్టార్‌డమ్‌ ప్రేక్షకులు అందించే వరం. నా నియంత్రణలో లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించను.

ప్రతిభకు గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వస్తే వాటిని బోనస్‌గా భావిస్తా’ అని చెప్పింది.

తెలుగులో ‘లెవెన్త్‌ అవర్‌’ సిరీస్‌తో ఓటీటీ వేదిక మీద అరంగేట్రం చేసింది తమన్నా.

ఆమె నటించిన తొలి తమిళ వెబ్‌సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’ త్వరలో విడుదలకానుంది.

Recent

- Advertisment -spot_img