Homeహైదరాబాద్latest Newsసబ్ రేషన్ దుకాణం ప్రారంభం.. జువ్వాడి నర్సింగరావు కృషి వల్లె ఏర్పాటు

సబ్ రేషన్ దుకాణం ప్రారంభం.. జువ్వాడి నర్సింగరావు కృషి వల్లె ఏర్పాటు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామమైన రామచంద్ర పేట గ్రామంలో నూతనంగా సబ్ రేషన్ డీలర్ దుకాణమును సింగిల్ విండో వైస్ చైర్మన్ సురుకంటి సంజీవ్ రెడ్డి మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న జువ్వాడి నరసింహారావు సోమవారం ప్రారంభించారు.అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం తీసుకోవడం కోసం వెల్లుల్ల గ్రామానికి 2 కిలో మీటర్లు పోవడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ జెడ్పిటిసి ఆకుల లింగరెడ్డి మరియు యూత్ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం గ్రామ ప్రజలకు ఇబ్బంది తొలిగాయని అన్నారు. మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి మాట్లాడుతూ తాను ఒక మాటగా చెప్పగానే అధికార దృష్టికి తీసుకెళ్లాడని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నూతన రేషన్ సబ్ డీలర్ దుకాణం ఏర్పాటుకు నర్సింగారావు గారు కృషి చేశారని అలాగే అధికారులు ఆర్డీవో, తాసిల్దార్ లకు గ్రామం తరపున మరియు యువకుల తరపున కృతజ్ఞతలు తెలుపారు.

ఈ సందర్భంగా నర్సింగారావు గ్రామ ప్రజలు యూత్ యువకులు ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లింగారెడ్డి ,గురుడు తిరుపతి , అంజయ్య, రాజశేఖర్ రంజిత్, రామకృష్ణ, అనిల్ ,మధు, లక్కీ, వంశీ రవీందర్ నవీన్ శేఖర్ రాహుల్ శ్రీకాంత్ రోహిత్ రాజు అనిల్ వెంకటేష్ శేఖర్ సతీష్ నాగరాజు తదితరులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img