Homeహైదరాబాద్latest Newsఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇదేనిజం, బొల్లారం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ అధ్యక్షుడు పి.జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి థియేటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకొని నివాళి అర్పించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిందన్నారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు.

Recent

- Advertisment -spot_img