Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర స్థాయి క్యారమ్ ఎంపిక పోటీలు.

రాష్ట్ర స్థాయి క్యారమ్ ఎంపిక పోటీలు.

ఇదే నిజం, బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర క్యారమ్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్యారమ్​ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ఎంపికలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్యారమ్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ బాలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి టీ రాజన్న తెలిపారు. అండర్ 12, అండర్ 14, అండర్ 18, అండర్ 21 విభాగాల్లో ఈ పోటీలు వుంటాయన్నారు. పోటీ చేయాలనుకున్న వాళ్లు తమ ఎంట్రీలను ఈ నెల 18 వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరి లో తమిళనాడులోని మధురై లో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9440010404 నంబర్​ లో సంప్రదించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img