Homeహైదరాబాద్latest NewsStock market: ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టాల్లో ఆ రంగాల షేర్లు..!

Stock market: ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టాల్లో ఆ రంగాల షేర్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టైటన్‌, విప్రో, రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్‌గ్రిడ్‌, సన్‌‌ఫార్మా, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img