దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ హెచ్చు తగ్గులను చవిచూస్తున్నాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టారు. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 529 పాయింట్ల లాభంతో 72,609 వద్ద.. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకొని 22,037 దగ్గర ట్రేడవుతున్నాయి. హెచ్‌యూఎల్, నెస్లేఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, మారుతీ, ఇన్ఫోసిస్ లాభాల్లో.. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.