దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 2,303.19 పాయింట్లు పెరిగి 74,382.24 వద్ద, నిఫ్టీ 735.80 పాయింట్లు లాభపడి 22,620.30 వద్ద ఉన్నాయి. BPCL, L&T మినహా మిగిలిన అన్ని షేర్లు సెన్సెక్స్, నిఫ్టీలలో లాభాలో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 83.37 వద్ద ముగిసింది.