Homeహైదరాబాద్latest NewsStock markets: చరిత్ర సృష్టించిన స్టాక్‌మార్కెట్లు… గరిష్ఠ మార్కును తాకిన సెన్సెక్స్..!

Stock markets: చరిత్ర సృష్టించిన స్టాక్‌మార్కెట్లు… గరిష్ఠ మార్కును తాకిన సెన్సెక్స్..!

స్టాక్‌ మార్కెట్లు చరిత్ర సృష్టించాయి. తొలిసారి 80 వేల పాయింట్ల గరిష్ఠ మార్కును సెన్సెక్స్ తాకింది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 24,200 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా లాభంలో, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌-30 సూచీలో ఐటీసీ, నెస్లే ఇండియా, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img