Homeఫ్లాష్ ఫ్లాష్Street food home delivery : ఇంటి వద్దకే స్ట్రీట్‌ ఫుడ్ సేఫ్ ప్యాక్‌

Street food home delivery : ఇంటి వద్దకే స్ట్రీట్‌ ఫుడ్ సేఫ్ ప్యాక్‌

Street food home delivery : ఇక ఇంటి వద్దకే స్ట్రీట్‌ ఫుడ్ సేఫ్ ప్యాక్‌… స్ట్రీట్‌ ఫుడ్ ఇక నేరుగా మీ ఇంటి ముంగిట‌కే వ‌స్త‌ది. క‌రోనా నేప‌థ్యంలో కేంద్రం ఈ మేర‌కు స్విగ్గీతో ఒక ఒప్పందం చేసుకుంది.

పానీపూరీ, ఛాట్‌, వడాపావ్‌ తదితర పదార్థాలను వీధుల్లో విక్రయించే చిరు వ్యాపారులను కేంద్రం ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురానుంది.

ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, స్విగ్గీ ముఖ్య ఆర్థిక అధికారి రాహుల్‌ బోత్రా ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి’ పథకం కింద వీధి వ్యాపారులను, వినియోగదారులను ఆన్‌లైన్‌లో అనుసంధానిస్తుంది.

ఈ స్కీంలో భాగంగా చిరు వ్యాపారులకు నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా రూ.10,000 వరకు రుణసహాయం అందజేస్తారు.

స్ట్రీట్ వెండ‌ర్స్ కు సాంకేతిక శిక్షణతో పాటు ధరలు, శుభ్రత, ప్యాకింగ్‌ ప్రమాణాలు తదితర విషయాల్లో కూడా తర్ఫీదునిస్తామని అధికారులు వివరించారు.

ఈ పథకం ద్వారా నగరాలు, పట్టణాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉండే 50 లక్షల మందికి పైగా చిరువ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img