Homeహైదరాబాద్latest News'ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు' : సీఎం రేవంత్

‘ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు’ : సీఎం రేవంత్

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వరికి మద్దతు ధరపై చర్చించారు. రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సమీక్షించిన ముఖ్యమంత్రి, ధాన్యం కొనుగోలులో అన్నదాతలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామన్న ఆయన, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్న సీఎం, ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img