Homeహైదరాబాద్latest Newsఅక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

ఇదే నిజం,నెల్లికుదురు: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తొర్రూరు సీఐ టీ సంజీవ్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. సంబంధిత ఏరు వద్ద ఇసుక రవాణా ప్రాంతాలను గుర్తించి దారులు లేకుండా కందకాలు తవ్విస్తామన్నారు. ప్రత్యేక గస్తీ బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రెవిన్యూ అధికారులతో పాటు మైనింగ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img