Homeహైదరాబాద్latest Newsకొమురంభీం ఆసిఫాబాద్ : పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు

కొమురంభీం ఆసిఫాబాద్ : పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు

  • ఎస్పీ కే సురేశ్ కుమార్

ఇదే నిజం, కొమురంభీం ఆసిఫాబాద్ ప్రతినిధి: వన్య ప్రాణుల కోసం వేటగాళ్లు పంట పొలాల్లో, అటవీప్రాంతాల్లో విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనంగా విద్యుత్ తీగలు అమర్చడంతో జంతువుల, మనుషుల ప్రమాదాలకు దారితీస్తున్నయని, ఇటీవల సిర్పూర్ మండల పరిధిలోని చప్రి గ్రామ సమీపంలో కొందరు వ్యక్తులు జంతువుల వేట కోసం కరెంట్ వైర్ పెట్టడంతో ఒక వ్యక్తి చనిపోయాడని, వ్యక్తి మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇలా విద్యుత్ వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై ఐపీసీ సెక్షన్ 304 -II , ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 135 కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img