ఇదే నిజం, బెజ్జంకి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మప్ప, సెక్టోరల్ ఆఫీసర్ ఆఫీసర్ భాస్కర్, ఎంపీఓ విష్ణు, ఎమ్మఎల్వో లక్ష్మి, బెజ్జంకి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి రేణుక,పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.