Homeహైదరాబాద్Road widening కోసం హ‌ఠాత్తుగా నిర్మాణాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం

Road widening కోసం హ‌ఠాత్తుగా నిర్మాణాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం

Sudden demolition of structures for road widening : రోడ్డు విస్తరణ కోసం హ‌ఠాత్తుగా వ‌చ్చి నిర్మాణాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం.

ఐటీ కారిడార్​ గచ్చిబౌలిలోని గోపన్​పల్లిలో రోడ్డు విస్తరణ పనులు(Road widening) ఉద్రిక్తతకు దారితీశాయి.

ఏలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు గోపన్​పల్లి తండాలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం రాత్రే మార్కింగ్ చేసి శనివారం పొద్దున్నే భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టడం ఏంటని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

శేరిలింగంపల్లి మండలం గోపన్​పల్లి తండా నుండి తెల్లాపూర్​ వరకు ప్రభుత్వం రేడియల్​ రింగు రోడ్డు నిర్మాణం చేపడుతుంది.

దీనిలో భాగంగా గోపన్​పల్లి తండా గ్రామంలో రోడ్డును వంద ఫీట్ల మేర విస్తరించేందుకు గతంలో నోటిఫికేషన్​ జారీ చేసి, 2018లో ప్రభుత్వం గెజిట్​ రిలీజ్​ చేసింది.

ఈ విస్తరణలో మొత్తం 43 నిర్మాణాలు, 15 ఖాళీ స్థలాలు నష్టపోతాయని అధికారులు గుర్తించారు.

కాగా గోపన్​పల్లి తండా ప్రభుత్వ సర్వే నెంబర్​ 34,36లో ఉండడంతో రహదారికి ఇరువైపుల ఉన్న నిర్మాణాలకు కేవలం నిర్మాణ స్ర్టక్షర్​ వ్యాల్యూ చెల్లిస్తామని, విస్తరణలో కోల్పోయిన భూమికి నష్టపరిహారం చెల్లించడం జరుగదని అధికారులు చెప్పడంతో ఇక్కడే వివాదం ప్రారంభమైంది.

దీనిపై అధికారులు గతంలో రెండు పర్యాయాలు స్థానికులతో మీటింగ్​ ఏర్పాటు చేశారు.

తమకు భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్​ చేయడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.

కూల్చివేయాల్సిన నిర్మాణాలకు నష్టపరిహారం రూ. కోటి 79 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిన బాధితులు తీసుకోలేదు.

కాగా శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా రెవెన్యూ, ఆర్​ ఆండ్​ బి, జీహెచ్​ఎంసీ అధికారులు గోపన్​పల్లి తండాకు వచ్చి రహదారికి ఇరువైపుల ఉన్న 43 నిర్మాణాలకు మార్కింగ్​ చేశారు.

అనంతరం శనివారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలు, ఇటాచీలతో ఒక్కసారిగా వచ్చి రోడ్డుకు ఇరువైపుల ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం స్టార్ట్​ చేశారు.

ఇరువైపుల ఉన్న 43 నిర్మాణాలు, 15 ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.

రాజేంద్రనగర్​ ఆర్డీఓ చంద్రకళ, శేరిలింగంపల్లి ఎమ్మార్వో వంశీమోహన్​ల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరగ్గా, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్​ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

పొద్దున్నే వచ్చి కూల్చిసిండ్రు… స్థానికులు

గోపన్​పల్లిలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాత్రి మార్కింగ్ చేసి, ఏలాంటి సమాచారం ఇవ్వకుండా, పొద్దున్నే అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేయడం ఏంటని అధికారుల తీరుపై మండిపడ్డారు.

ఇళ్లు, దుకాణాల్లో ఉన్న సామాగ్రిని రహదారిపై పాడేసి, ఇండ్లలో ఉన్న వాళ్లను బయటకు పంపించచి కూల్చివేతలు చేపట్టారన్నారు.

రహదారికి ఇరువైపుల ఉన్న నిర్మాణదారులు అందరూ ఒక్కసారిగా రోడ్డున పడ్డామని ఆవేధన వ్యక్తం చేశారు.

తమకు కేవలం నిర్మాణ నష్టపరిహారం మాత్రమే ఇస్తామని అంటున్నారని, భూమికి సంబంధించిన పరిహారం ఇవ్వాలని అధికారులను అడిగితే హెచ్చరిస్తున్నారని వాపోయారు.

భవన నిర్మాణాలకు జీహెచ్​ఎంసీ అధికారులు అనుమతులు ఇస్తేనే ఇండ్లు కట్టుకున్నామని, ప్రతి సంవత్సరం లక్షల్లో ట్యాక్సులు చెల్లిస్తున్నామన్నారు.

గత60 సంవత్సరాలుగా ఉన్న ఇండ్లను సైతం ప్రభుత్వ స్థలంలో కట్టారూ అంటూ కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూల్చవేతల విషయం తెలుసుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి గోపన్​పల్లికి చేరుకొని బాధితులకు అండగా నిలబడ్డారు.

రోడ్డు విస్తరణలో భూమిని కోల్పొయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Recent

- Advertisment -spot_img