Homeఫ్లాష్ ఫ్లాష్Suicide Forest : ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే అతీతశక్తులు వస్తాయట

Suicide Forest : ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే అతీతశక్తులు వస్తాయట

ఏటా పదుల సంఖ్యలో జరుగుతున్నసూసైడ్​లు 1950 నుంచే ప్రారంభమైన ఆత్మహత్యల పర్వం అడవంతా మృతదేహాలు, కళేబరాలు.

పైగా అక్కడ ఆత్మహత్య చేసుకుంటే అతీత శక్తులు వస్తాయంటే ఇక ఆగుతారా ఈ జనం. ఆత్మహత్యలు చేసుకునేందుకు ఎగబడుతారు.

జపాన్​ రాజధాని టోక్యోకి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న అవుకిగహారా అటవీ ప్రాంతాన్ని అక్కడి ప్రజలు ‘సూసైడ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తుంటారు.

ఈ ప్రాంతంలో ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటుంటాయి.

35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన అవుకిగహారా అటవీ ప్రాంతం ఎత్తైన చెట్లతో నిండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

దూరం నుంచి చూస్తే పచ్చని చెట్లతో ఎంతో అందంగా కన్పిస్తుంది. కానీ అడవిలోకి పోతే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

ఎక్కడ చూసిన చెట్లకు ఉరేసుకున్న శవాలే కన్పిస్తాయి. ఇక అడవంతా చెట్లకు వేలాడే మృతదేహాలు, వన్యమృగాలు తినివదిలేసిన కళేబరాలు, మృతులకు సంబంధించిన వస్తువులు అటవీ ప్రాంతమంతటా దర్శనమిస్తాయి.

జపాన్‌ పురాణాల ప్రకారం.. ఈ అడవిలో ఉండే చెట్లకు ఉరి వేసుకుంటే మృతి చెందిన తర్వాత అతీతశక్తులు వస్తాయని నమ్ముతారు.

అందుకే ఈ అడవిలోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. దీంతో ఈ అడవిని దెయ్యాల నివాసంగా కూడా చెబుతుంటారు.

1950 నుంచే ప్రారంభమైన ఆత్మహత్యల పర్వానికి చెక్​ పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది.

అయినా వివిధ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారు ఈ అడవిలోకి వచ్చి చెట్లకు ఉరి వేసుకుంటారు.

క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి మనసు మార్చేందుకు అడవిలో ప్రవేశ ప్రాంతాల్లో ‘మీ పిల్లల గురించి, కుటుంబం గురించి కాస్త ఆలోచించండి’.

‘నీ జీవితం తల్లిదండ్రులు నీకిచ్చిన అపూర్వమైన బహుమతి’, ‘సాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.. ఆత్మహత్య చేసుకోకండి’ అని బోర్డులు పెట్టారు. అయినా ఆత్మహత్యల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు.

తరచూ స్థానిక పోలీసులు, వాలంటీర్లు అడవిలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతుంటారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడతాయి.

వాటిని తీసుకొచ్చి మృతుల కుటుంబసభ్యుల వివరాలు తెలిస్తే వారికి అప్పగిస్తుంటారు. లేదా పోలీసులే దహన సంస్కారాలు చేసేస్తారు.

అడవి భూగర్భంలో ఉండే అయస్కాంత లక్షణాలున్న ఇనుప ఖనిజాలు అధికంగా ఉన్నాయి. దీని కారణంగా ఈ అడవిలో టెలిఫోన్​ సిగ్నల్స్ పనిచేయవు.

దిక్కులు చూపే దిక్సూచి కూడా అస్తవస్త్యంగా పని చేస్తుంది. దీని కారణంగా అడవిలో తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే చెట్లకు రబ్బర్లు పెట్టడంతోపాటు కొన్ని గుర్తులు కూడా పెడుతుంటారు.

Suicide is a great sin. But many end their lives each year for small reasons. Having a special area to commit suicide like this,Suicide is a great sin. But many end their lives each year for small reasons. Having a special area to commit suicide like this,

Recent

- Advertisment -spot_img