Homeజిల్లా వార్తలుసుకుర సైన్స్ ప్రోగ్రాం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విద్యార్థిని కలకోట...

సుకుర సైన్స్ ప్రోగ్రాం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విద్యార్థిని కలకోట శ్రీజ

ఇదే నిజం,గొల్లపల్లి : ఆదర్శ పాఠశాల జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన కలకోట శ్రీజ రాష్ట్ర స్థాయి “సుకుర సైన్స్ ప్రోగ్రామ్” పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30న హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ మండల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తే జపాన్‌ దేశ కార్యక్రమం “సుకుర సైన్స్‌”లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన శ్రీజ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గణితం,సైన్స్ఆంగ్లం,అంశాలుగా కలిగిన ఈ పోటీల్లో నెగ్గిన శ్రీజ ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు ,పదవ తరగతిలో పది జి.పి.ఎ సాధించడం విశేషం.
శ్రీజ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని, తమ పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో గెలుపొందేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నగేష్‌, గైడ్‌ టీచర్‌ నాయనాల పెద్దన్న, జె.అరుణ్‌ కిరణ్‌, జి.వి.రమణ, రాజశేఖర్‌,సతీష్‌కుమార్‌, రాజేంధర్‌, మురళీధర్‌, రాజేశ్వరి,సంధ్యారాణి,జి.సంధ్య, కె.రమాదేవి,పి.హపియా, సంధ్య విద్యార్థులు అభినందించారు.

Recent

- Advertisment -spot_img