Homeహైదరాబాద్latest Newsఎండాకాలం.. ప్రయాణికులకు నిలువ నీడేది?

ఎండాకాలం.. ప్రయాణికులకు నిలువ నీడేది?

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మండల కేంద్రంలోని పాత బస్టాండ్లో దశాబ్దాలుగా బస్ షేల్లర్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వేసవి కాలం అవ్వడంతో ఎండ తీవ్రతతో పాటు వడ గాలులు పెడుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికులు మండే ఎండలోనే బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.గతంలో చార్జీల పేరుతో ప్రయాణికుల నుండి ముక్కు పిండి డబ్బులు వసూల్ చేసి సౌకర్యల కల్పనపై మాత్రం దృష్టి సారించకపోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి.

ఈ పాత బస్టాండ్ కేంద్రంగా మండలంలోని పది గ్రామాల ప్రజలతో పాటు నిజామాబాద్ జిల్లా బీంగల్ మరియు పరిసర గ్రామాల ప్రయాణికులు సైతం బస్సుల కోసం నిరీక్షిస్తారు. మరోవైపు మండలానికి చెందిన మరో ఆరు గ్రామాలతో పాటు సమీప మండలలైన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ గ్రామీణ ప్రాంత ప్రయాణికులు సైతం మండుటెండలో బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు.ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, మహిళలకు ఉచితప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది.

ఉచిత ప్రయాణం కావడంతో జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి నిత్యం బస్సుల్లో రవాణా విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా సౌకర్యాలు లేనికారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.జగిత్యాల కరీంనగర్లకు, కార్యాలయాల పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంటి పిల్లలతో కుటుంబ సభ్యులు ఎండలోనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంతో ఎండలోనే నిలపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది.రోడ్లపై నిలబడి ఉన్న కనీసం తాగడానికి నీరు లేకపోవడంతో ఎండ తాకిడి ప్రయాణికులు బలి అవుతున్నారు.వర్షకాలంలో వర్షాలకు తుడుచుకుంటూ, చలి కాలం వణుకుంటూ రోడ్లపై నిలబడి ప్రయాణం సాగిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img