Homeజిల్లా వార్తలుఆదివారం గోదా కల్యాణం.. ఏర్పాట్లు పూర్తి

ఆదివారం గోదా కల్యాణం.. ఏర్పాట్లు పూర్తి

ఇదే నిజం, కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడలోని సీతారామచంద్ర దేవాలయంలో ఆదివారం(14న) ఉదయం 11 గంటలకు గోదా దేవి కల్యాణ మహోత్సవం జరగనున్నదని ఆలయ అర్చకులు కోహెడ ప్రసాద్ రావు శర్మ తెలిపారు. కోహెడ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నెల రోజుల నుంచి నిత్యం తిరుప్పావై పాశుర పఠనం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుప్పావై 30 పాశురములు పూర్తయిన సందర్భంలో భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాయకుల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img