HomeTelugu Newsసునీల్ ఛెత్రీ సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు గుడ్ బై..

సునీల్ ఛెత్రీ సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు గుడ్ బై..

భారత్‌లో ఫుట్‌బాల్ పేరు వినగానే గుర్తుకు వచ్చే పేరు సునీల్ ఛెత్రి. భారత ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి పేరు కేరాఫ్ అడ్రస్. క్రికెట్‌ను మతంగా ఆరాధించే భారతదేశంలో ఫుట్‌బాల్‌కు మంచి గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఏకైక ఆటగాడు సునీల్ ఛెత్రి. అయితే సునీల్ ఛెత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సునీల్ ఛెత్రి ఆటకు గుడ్‌బై చెప్పనున్నారు. వచ్చే నెలలో కోల్‌కతా వేదికగా కువైట్‌తో జరిగే మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2005లో 21ఏళ్ల వయసులో పాకిస్థాన్ జట్టుపైనే తన తొలి అంతర్జాతీయ గోల్ సాధించిన ఛెత్రి.. ఇప్పటివరకు 94 గోల్స్ (150 మ్యాచ్‌ల్లో) చేసి.. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

Recent

- Advertisment -spot_img