Homeహైదరాబాద్latest Newsఅడవిలో అనుపమ సాహసాలతో సర్​ ప్రైజ్

అడవిలో అనుపమ సాహసాలతో సర్​ ప్రైజ్

​కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మల్లిక్ రామ్ దిరెచ్తిఒన్ లో సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్వ్కేర్‌’తో తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని బోల్డ్ సీన్స్ అందరినీ షాక్‌కు గురి చేశాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అనుపమ బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలను వైరల్ చేసిన విషయం తెలిసిందే. అనుపమ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.తాజాగా, కేరళ కుట్టి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో స్కై రోప్ డైవింగ్, గాల్లో రోప్ సహాయంతో సైకిల్ తొక్కడం, కార్ రేస్, సెలయేళ్ల వద్ద ఫుల్ ఎంజాయ్ చేసింది. అంతేకాకుండా అడవిలో జంతువులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించింది. అలాగే బోట్‌లో డాన్స్ చేసింది. ప్రస్తుతం అనుపమకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img