శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలోని బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’ ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అద్భుత ఘట్టం ప్రారంభమైంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాల పాటు విగ్రహ మూర్తిపై సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు.