Homeక్రైంమలయాళీ నటి అనుమానాస్పద మృతి

మలయాళీ నటి అనుమానాస్పద మృతి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మలయాళీ నటి రెంజూషా మీనన్‌ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తిరువనంతపురంలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు వారు చెప్పారు. మరోవైపు, రెంజుషా గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఆ బాధలు తట్టుకోలేకే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుటుంబసభ్యులు, స్థానికులు అనుకుంటున్నారు.కొచ్చికి చెందిన రెంజుషా టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ఆమె పలు ధారావాహికల్లో నటించారు. సినిమాల్లోనూ సహాయనటి పాత్రలు పోషించారు. ‘సిటీ ఆఫ్‌ గాడ్‌’, ‘బాంబే మార్చ్‌’, ‘వన్‌ వే టికెట్‌’ వంటి ప్రాజెక్ట్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్‌లో రాణిస్తోన్న తరుణంలోనే ఓ నటుడిని ఆమె వివాహం చేసుకున్నారు. పలు ధారావాహికలకు ఆమె నిర్మాతగా వర్క్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img