Homeజిల్లా వార్తలువరంగల్ లాడ్జిలో మహిళ అనుమానస్పదంగా మృతి

వరంగల్ లాడ్జిలో మహిళ అనుమానస్పదంగా మృతి

ఇదేనిజం, కాశిబుగ్గ వరంగల్: లాడ్జిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. లాడ్జి నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ చౌరస్తాలోని శ్రీ లాస్య లాడ్జిలో మంగళవారం రాత్రి శారద అనే మహిళ అనుమాస్పదంగా మృతి చెందింది. మంగళవారం రాత్రి శారద అనే మహిళ ఒక వ్యక్తితో కలిసి లాడ్జిలో చెక్ ఇన్ చేశారని తెలిపారు. చెక్ ఇన్ చేసిన 20 నిమిషాలలోనే ఆ మహిళకు గుండె నొప్పి వస్తుందని తనతో వచ్చిన వ్యక్తికి చెప్పింది. ఆ మహిళతో వచ్చిన వ్యక్తి లాడ్జి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడని తెలిపారు. దాంతో లాడ్జి సిబ్బంది శారదకు నీళ్లు తాగించి వెంటనే పోలీసులకు సమాచారం అందించామని అంతలోనే శారద మృతి చెందిందని వారు తెలిపారు. శారద కుమారుడు ఎవరో కావాలనే మా అమ్మను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద ఇంత జార్ గంజ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img