Homeహైదరాబాద్latest Newsఐపీఓకు స్వీగ్గీ

ఐపీఓకు స్వీగ్గీ

ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. వాటాదారుల నుంచి ఇదివరకే అనుమతి పొందిన ఈ సంస్థ.. ఇప్పుడు సెబీకి పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన ముసాయిదా పత్రాల్ని సమర్పించినట్లు తెలిసిందే. దీని కోసం కాన్ఫిడెన్షియల్ మార్గాన్ని ఎంచుకుంది స్విగ్గీ. అంటే కంపెనీ వెల్లడించేంత వరకు ఐపీఓకు సంబంధించిన వివరాలేం ప్రజలకు అందుబాటులో ఉండవు.

ఇప్పటికే ఫుడ్ డెలివరీ నుంచి జొమాటో ఐపీఓగా ఉండగా.. ఇది అతిపెద్ద ఐపీఓగా వచ్చి అప్పట్లో ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిల్చింది. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లిస్టింగ్ ప్రైస్, ఇష్యూ ప్రైస్‌ను దాటి ట్రేడవుతోంది. ఇంకా తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్న సమయంలో ఐపీఓ ఆలోచన వదిలేసింది స్విగ్గీ. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చేందుకు సిద్ధమైంది.

సాధారణంగా ఏదైనా సంస్థ ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలతో సెబీకి దరఖాస్తు చేసుకుంటే.. ప్రజలకు ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయని చెప్పొచ్చు. ఒకసారి ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపితే.. తర్వాత 12 నెలల వరకు అది చెల్లుబాటు అవుతుంది. 2022 నవంబర్‌లో తొలిసారిగా. కాన్పిడెన్షియల్ మార్గం తీసుకొచ్చింది సెబీ. ఈ మార్గంలో అందిన దరఖాస్తుల్ని సెబీ పరిశీలించి ఆమోదం తెలుపుతుంది.

గతంలో టాటా గ్రూప్‌కు చెందినటువంటి టాటా ప్లే ఈ మార్గంలోనే తొలిసారిగా ముసాయిదా పత్రాల్ని సెబీకి సమర్పించింది. స్టార్టప్ అయిన ఓయో ఈ మార్గంలోనే దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు స్విగ్గీ ఇదే బాటలోన పయనిస్తోందని చెప్పొచ్చు. ఈ ఐపీఓ ద్వారా రూ. 10,400 కోట్ల వరకు సమీకరించేందుకు స్విగ్గీ సిద్ధమైంది. దీంట్లో రూ. 3750 కోట్లు తాజా షేర్లను జారీ చేయడం ద్వారా, రూ. 6664 కోట్లు ఆఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమీకరించాలని చూస్తోంది.

Recent

- Advertisment -spot_img