Homeహైదరాబాద్latest Newsవైన్ షాపుల సిండికేట్ దందా.. బెల్టు షాపులకు నేరుగా డోర్ డెలివరీ

వైన్ షాపుల సిండికేట్ దందా.. బెల్టు షాపులకు నేరుగా డోర్ డెలివరీ

  • ఎక్సైజ్ ఉన్నతాధికారుల అండతోనే వైన్స్ షాపు యజమానుల లిక్కర్ దందా
  • బ్రాంది షాపులలో నో స్టాక్, బెల్ట్ షాపులలో లలో ఫుల్ స్టాక్
  • ఎక్సైజ్ ఎస్ ఐ సి ఐ లను వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించిన మందుబాబులు
  • అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాబ్

ఇదే నిజం, గూడూరు: వైన్స్ షాపులన్నీ సిండికేటయ్యి, స్థానిక ఎక్సైజ్ ఎస్ ఐ, సి ఐ ల. ఉన్నతాధికారుల అండదండల తోనే, వైన్ షాప్ ల యజమానులు, గూడూరు మండల కేంద్రంలోని 39 గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్నారని, బెల్ట్ షాపులలో అన్ని రకాల బ్రాండ్ లా బీర్లు, వైన్లు దొరుకుతున్నాయని, వైన్ షాప్ లలో మాత్రం ఎప్పటికీ నో స్టాక్ అంటున్నారని, ఎక్కువ మొత్తంలో జీరో సరుకునే విక్రయించి స్థానిక వైన్స్ లల్లో అమ్ముతున్నారని, ఒక ఫుల్ బాటిల్ పై, ఎమ్మార్పీ రేట్ల కంటే 40 నుంచి 80 రూపాయల ఎక్కువగా ధరలకు అమ్ముతున్నారని, మందుప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లనే, రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తూన్నామన్నారు. ఈరోజు రాత్రి దాదాపు ఏడు గంటల నుండి 7:40 వరకు జరిగిందిస్థానిక ఎక్సైజ్ ఎస్ ఐ, సి ఐ ల అండదండలతోనే ఈ సిండికేట్ వ్యవహారం జోరుగా సాగుతుందని, ఈ ఎక్సైజ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, పోలీసులు నిల్వరించిన అరెస్టు చేసిన భయపడేది లేదని, పోలీసులు గో బ్యాక్ అంటూ, పోలీసు యంత్రాంగం కూడా వైన్ షాపులు యజమానులకి వత్తాసు పలుకుతుందని, ఇది ఏజెన్సీ గిరిజన మండలం, ఈ గిరిజన ప్రాంత పేద ప్రజలకు వైన్స్ షాపుల మందు అందని ద్రాక్ష లాగా మారిందని, బెల్ట్ షాపులలో అధిక ధరలకు గిరిజనులు మందును సేకరించి, ఖాళీ అవుతున్నాయని, అధిక ధరలతో గిరిజనులు నష్టపోతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు ఉన్నారని, జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే ఇక్కడికి రావాలని, లేకుంటే ఎంతవరకు అయినా సిద్ధమని స్లొగన్స్ ఇచ్చుకుంటూ.. అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వైన్ షాపుల యజమానుల మీద చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ ధర్నాలు పునరావృతం అవుతాయని మందు ప్రియులు హెచ్చరించారు. చివరకు పోలీసుల జోక్యంతో ధర్నాను విరమించారు.

Recent

- Advertisment -spot_img