HomeతెలంగాణT BJP :టీబీజేపీ.. సైలెంట్ మోడ్

T BJP :టీబీజేపీ.. సైలెంట్ మోడ్

టీబీజేపీ.. సైలెంట్ మోడ్

  • కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ఫైట్
  • కనిపించని కాషాయ పార్టీ
  • క్యాడర్ లో అయోమయం
  • కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక గ్రాఫ్ డౌన్
  • టిఫిన్ బైఠక్ అట్టర్ ప్లాప్

ఇదే నిజం, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాషాయపార్టీ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి. కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ గా ఉండేది. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ పెద్దగా లైమ్ లైట్ లో ఉండటం లేదు.

ఈటల ఎక్కడ?
బండి సంజయ్ నాయకత్వాన్ని గతంలో ఈటల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో పనిచేయలేనంటూ ఢిల్లీకి వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో అధిష్ఠానం బండిని తప్పించింది. ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా పదవి కట్టబెట్టింది. అయితే ప్రస్తుతం ఈటల రాజేందర్ కూడా పెద్దగా కార్యక్రమాలు చేయడం లేదు. రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ ను ఉత్సాహ పర్చడంలో ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.

నామమాత్రంగా టిఫిన్ బైఠక్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో బీజేపీ టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. కానీ పెద్ద నేతలు ఎవరూ యాక్టివ్ గా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనకపోవడంతో టిఫిన్ బైఠక్ నామమాత్రంగానే సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఒప్పందంతో పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే.. రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img