Homeఫ్లాష్ ఫ్లాష్T. Hareesh Rao: ఎన్నిక‌లు అయిపోతే కాంగ్రెస్‌, భాజాపా నేతలు మళ్లీ ఇటువైపు వస్తారా?

T. Hareesh Rao: ఎన్నిక‌లు అయిపోతే కాంగ్రెస్‌, భాజాపా నేతలు మళ్లీ ఇటువైపు వస్తారా?

సిద్దిపేట: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్‌, భాజాపా నేతలు మళ్లీ ఇటువైపు వస్తారా? కనబడతారా? మన ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటి వాళ్లు ఎవరో గమనించాలి అని హరీశ్ రావు అన్నారు.

బుధవారం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు.. భాజపా అంటే బాయిల కాడ మీటర్లు. రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల నుంచి రైతులకు నాణ్యమైన 24గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామ‌న్నారు.

దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు, రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా ఇస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడిగా రెండు పంట కాలాల్లో కలిపి రూ.10వేలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నించి ఓటేయ్యాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img